ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ డి.ఈనీ కలసిన బీ.ఆర్.ఎస్ నాయకులు

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 25 అక్టోబరు 2024
భారత రాష్ట్ర సమితి మణికొండ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ్ల ఆద్వర్యంలో పార్టీ కార్య కార్థలందరు నూతనముగా విచ్చేసిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ డి.ఈ రమేష్ చంద్రను కలసి సాదరంగా ఆహ్వానించి, సన్మానించి స్థానికంగా మణికొండలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై ప్రత్యేకించి పంచవటి కాలనీ, తనాష నగర్ హుడా కాలనీ, ఖిజ్ర కాలనీ, కే.పి.ఆర్ కాలనీ తది తర కాలనీలు, నెక్నుంపూర్ పరిధి లోని బాబు హిల్స్ లో త్రీ ఫేస్ సప్లై, వేంకటేశ్వర కాలనీ లో 11 కేవీ లైన్, పోల్స్ రీప్లేస్ వంటి విషయాలు, ఇంటర్నెట్ వైర్ ల కారణముగా ప్రమాద భరిత పరిస్థితి నెలకొన్నదనీ, పుప్పాలగూడ పరిధి లోని నెమళినగర్ వద్ద గల ట్రాన్స్ఫార్మర్ వల్ల ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనీ కావున వెంటనే షిఫ్టింగ్ చేయాలని, ఓవర్లోడ్ అయిన ట్రాన్స్ఫార్మర్ లు, పాడై పోయిన సర్వీస్ లీడ్స్ పరంగా తరచుగా జరుగుతున్న విద్యుత్ అంతరయం సరి చేయమని, జంగిల్ కట్టింగ్ పేరుతో వదలిన చెత్త చేదారాన్ని శుభ్ర పరచడం జాప్యం జరుగుతున్న కారణాల వలన మునిసిపాలిటీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని అన్ని విషయాలు వివరంగా తెలుపడం జరిగినది. మణికొండలోని అన్ని సమస్యలపై వినతి పత్రం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ డి.ఈ రమేష్ చంద్రను కలసి అందజేయడం జరిగినదనీ, పర్యవసానంగా విద్యుత్ అంతరాయల పట్ల స్పందించిన డీ.ఈ వెంటనే ఏ.ఈ కి ఫోన్ చేసి వినతి పత్రంలోని సమస్యలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పురోగతిని ఎప్పటి కప్పుడు తెలియ పరుచమని అదేశించడమైనది, ఇట్టి కార్యక్రమంలో సీతారాం ధూళిపాళ, ధనరాజ్, ఆలస్యం నవీన్ కుమార్, రూపా రెడ్డి, ముత్తంగి లక్ష్మయ, అందే లక్ష్మణ్ రావు, రాజేంద్ర ప్రసాద్, గుట్టమిది నరేందర్, విఠల్, సంగం శ్రీకాంత్, కిరణ్, శ్రీధర్, టైగర్ రేఖ,ఆశ్వక్ అలి తది తరులు కలరు.

Leave A Reply

Your email address will not be published.

Breaking