ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 25 : 21వ అఖిల భారత పశుగణన-తెలంగాణ కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బంధీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్లో జిల్లా పశువైద్య-పశు సంవర్ధక శాఖ అధికారి ఈర్ల శంకర్, మండలాల పశు వైద్యాధికారులతో కలిసి పశుగణన కార్యక్రమ గోడప్రతులను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…21వ అఖిలభారత పశుగణన-తెలంగాణ సర్వే కార్యక్రమం జిల్లాలో ఫిబ్రవరి 28, 2025 వరకు కొనసాగుతుందని,ఈ ప్రక్రియలో ఆవులు, గేదెలు,గొర్రెలు,కోళ్ళు, మేకలు,ఇతర జంతువుల సమాచారాన్ని డిజిటల్ పద్దతిలో మొబైల్ అనువర్తనం ద్వారా నిక్షిప్తంగా చేయడం జరుగుతుందని తెలిపారు.రెవెన్యూ గ్రామాన్ని ప్రాతిపదికగా తీసుకొని జిల్లాలోని గ్రామపంచాయతీలలో,వార్డులలో పశుగణన చేసేందుకు 127 మంది ఎన్యుమరేటర్లను నియమించి తగిన శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అన్ని మండలాలలోని పశు వైద్యాధికారుల పర్యవేక్షణలో పశుగణన,డిజిటల్ అనువర్తనం ద్వారా పశువుల సమాచారాన్ని నిక్షిప్తం చేయడం జరుగుతుందని, ఎలాంటి పొరపాట్లు లేకుండా సర్వే ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.