ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 25 : రాష్ట్రంలో స్థానిక సంస్థల వారిగా కల్పించవలసిన, అవసరమైన రిజర్వేషన్లు పేర్కొనే విషయంలో ఎస్.సి., ఎస్.టి.,బి.సి. కులాలకు 50 శాతం రిజర్వేషన్ మించకుండా తెలంగాణ వెనుకబడిన తరగతుల కమీషన్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని వెనుకబడిన తరగతుల కులములు, వెనుకబడిన తరగతుల కుల సంఘ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, ఆసక్తి గల అభ్యర్థుల నుండి,పార్టీల నుండి సమర్పణలు, అభ్యర్థనలు, సలహాలు, ఆక్షేపణలను స్వీకరించడం కొరకు ఈ నెల 28న ఉదయం 10గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో బహిరంగ విచారణ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.ఈ విచారణకు ఉమ్మడి జిల్లాలోని పార్లమెంట్ సభ్యులు,శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, మున్సిపల్ చైర్మన్, ప్రజాప్రతినిధులతో పాటు జిల్లాలోని బి.సి. సంఘ నాయకులు, ప్రతినిధులు,బి.సి కులస్తులు,ఎస్.సి., ఎస్.టి.,మైనార్టీ నాయకులు హాజరై తమ సమర్పణలు, అభ్యర్థనలు, సలహాలు, ఆక్షేపణలను 20 రూపాయల విలువ గల నాన్-జుడిషియల్ బాండ్ పేపర్పై ప్రమాణ పత్రమును ప్రభుత్వ నోటరీ అడ్వకేట్ సంతకముతో తమ ఆక్షేపణలను 6 ప్రతులను జత చేసి సమర్పించాలని తెలిపారు