జిల్లాకు చెందిన 24 మంది ఏ.ఎస్ఐ లకు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా పదోన్నతి కల్పించిన …. మల్టీ జోన్- II ఐజి, వి.సత్యనారాయణ
•పదోన్నతి పొందిన ఎస్ఐ లను అభినందించిన
…. జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్
సంగారెడ్డి జనవరి 16 ప్రజ బలం ప్రతినిధి:
సంగారెడ్డి జిల్లాకు చెందిన 24-మంది ఏ.ఎస్ఐ లకు ఎస్ఐ లుగా పదోన్నతి కలిస్తూ మల్టీ జోన్- II ఐజి వి.సత్యనారాయణ ఐపియస్ ఉత్తర్వులు వెలువరిచారని జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐపియస్ అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాలకు పైగా పోలీసు శాఖలో విధులు నిర్వహించి, సుధీర్గ సర్వీస్ లో ఎలాంటి రిమార్క్ లేకుండా సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా పదోన్నతి పొందిన అధికారులందరిని జిల్లా ఎస్పీ అభినందించి, ఎస్ఐ ర్యాంక్ చిహ్నంను అలకరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
పదోన్నతి ద్వారా స్థాయితో పాటు బాధ్యత మరింత పెరుగుతుందని, పెరిగిన బాధ్యతను క్రమశిక్షణతో నిర్వహిస్తూ ప్రజలలో పోలీస్ శాఖ పట్ల ఉన్న నమ్మకాన్ని, గౌరవాన్ని మరింత పెంచే విధంగా చూడాలని, సర్వీసులో మరిన్ని ఉత్తమ సేవలను అందించి తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.
ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి, రోజు వ్యాయామం చేయాలన్నారు. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఎలాంటి విధులనైనా సమర్దవంతంగా నిర్వహించగలమని, కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండగలమని అన్నారు. మానసికంగా శారీరకంగా ఒత్తిడిని దూరం చేయడానికి శారీరక శ్రమ, యోగా అవసరమని ఎస్పీ అన్నారు.