ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జనవరి 16 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 13వ,6వ వార్డులలో పశుగణన చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంను మున్సిపాలిటీ పశుగణన సూపర్వైజర్ డా.మంచాల భూమయ్య పరిశీలించి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీ పరిధిలోని ఇండ్లలో ఉన్న పశువుల, పెంపుడు జంతువుల మరియు కోళ్ల వివరాలను పగడ్బందీగా లెక్కించాలని సూచించడం అయినది.ఈ కార్యక్రమంలో ఎనిమరేటర్ గంగమల్లు పాల్గొన్నారు.