రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ ఎన్నికలకు 26 నామినేషన్స్

హైదరాబాద్ జూలై 24 (ఎక్స్ ప్రెస్ న్యూ స్);హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశముల మేరకు తేదీ.10.07.2023 ఇవ్వబడిన నోటిఫికేషన్ ప్రకారం సోమవారం హైదరాబాదు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ ఎన్నికలకు సొసైటీ సభ్యుల నుండి నామినేషన్ 26, పత్రములను ఎన్నికల అధికారి ఏ. పద్మ, జిల్లా కో ఆపరేటివ్ అధికారి స్వీకరించారు. 26 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. అందిన నామినేషన్ పత్రముల పరిశీలన 25.07.2023 నాడు జరుగును. మరియు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా 26.07.2023 నాడు ప్రకటించబడును. తేదీ 30.7.2023 నాడు పోలింగ్ రెడ్ క్రాస్ బాలికల ఉన్నత పాటశాల మాసాబ్ ట్యాంక్ నందు జరుగుతుంది అని కంటెస్టడ్ చైర్మన్ మామిడి భీమ్ రెడ్డి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking