ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 24 : పేద ప్రజలకు డబుల్ బెడ్ ఇండ్లను అందించాలని డిమాండ్ చేస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పిలుపు మేరకు సోమవారం రోజు బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూం అర్హులతో కలిసి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ పాల్గొనడం జరిగింది. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 9 సంవత్సరాలు గడిచిన ఇప్పటి వరకు ఏ ఒక్కరికీ కూడా డబుల్ బెడ్ రూం ఇండ్లు అందించకుండా పేద ప్రజలను మోసం కేసిఆర్ మోసం చేశారని రమేష్ రాథోడ్ అన్నారు.ప్రధాన మంత్రి అవాస యోజన ద్వారా నిర్మించే ఇండ్లను పేద ప్రజలకు అందకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వస్తేనే పేద ప్రజలు 50 లక్షల ఇండ్లు నిర్మిస్తామని తెలిపారు. మంచిర్యాల జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు కేసిఆర్ దగ్గర బానిసల్లాగా బ్రతుకుతున్నారని కేసిఆర్ దగ్గరికి వెళ్ళి మా జిల్లాకు ఎందుకు డబుల్ బెడ్ ఇండ్లు కేటాయించడం లేదని ప్రశించడం లేదని అన్నారు. కాంగ్రెస ప్రభుత్వ హయాంలో ప్రేమ్ సాగర్ రావు 1400 మంది పేదలకు దొంగ పట్టాలు ఇచ్చి మోసం చేశారని అన్నారు. పేద ప్రజల సంక్షేమం కాంగ్రెస్ మరియు టిఆర్ఎస్ పార్టీ లకు పట్టింపు లేదని పేద ప్రజలకు న్యాయం బిజెపితోనే సాధ్యం అని రఘునాథ్ అన్నారు.వచ్చే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వస్తేనే అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్ రూం ఇల్లు అందిస్తామని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చి మోసం చేసిన వారికి భూములు అందిస్తామని తెలిపారు.