లక్షెట్టిపేట ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 24 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ 47వ జన్మదిన వేడుకలు మున్సిపాలిటీతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఘనంగా సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ…రాష్ట్ర అభివృద్ధి లో కేటీఆర్ తనదైన ముద్ర వేస్తున్నారని కొనియాడారు.సీఎం కేసీఆర్ కు తగిన తనయుడుగా కే టీ ఆర్ సేవలు మరువలేనివన్నారు.కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు స్థానిక ఐబీ లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.పలు సేవా కార్యక్రమాలు చేశారు.కాగా, పుస్కూరు రామ్మోహన్ రావు వర్గం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు.అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ వేడుకల్లో డీసీఎమ్మెస్ చైర్మన్ తిప్పని లింగయ్య, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్,బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పాదం శ్రీనివాస్,బీఅర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య,మాజీ వ్యవసాయ కమిటీ చైర్మన్ బియ్యాల తిరుపతి,బాణాల రమేష్, నాయకులు సురేష్,రాజన్న, కోమాకుల రవి,రవీందర్, శంకరయ్య,వెంకటేష్,బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking