26వ డివిజన్ కాంగ్రెస్ మహిళ ఉపాధ్యక్షురాలుగా కర్రె రమాదేవి

 

ప్రజాబలం వరంగల్ తూర్పు మార్చి9::

వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 26వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలుగా కర్రె రమాదేవినియమితులయ్యారు. ఈ మేరకు వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు నారగోని స్వప్న ఉత్తర్వులు జారీ చేస్తూ నియామక పత్రాన్ని శనివారం రమాదేవికి అందజేశారు. ఈ సందర్భంగా కర్రే రమాదేవి మాట్లాడుతూ కొండ దంపతుల ఆశీర్వాదంతో డివిజన్లో కాంగ్రెస్ పార్టీనీ బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తతో కలిసి కృషి చేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. 26వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలుగా తన నియమాకానికి సహకరించిన నారగోని మురళి, నల్గొండ రమేష్, మడిపల్లి కృష్ణ, 26 వ డివిజన్ అధ్యక్షులు జన్నుభాస్కర్, ఓరుగంటి మల్లికార్జున్, వీరన్న లకు ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలియజేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking