వరంగల్ లోక్ సభ స్థానానికి టికెట్ కోసం అన్ని అర్హతలు ఉన్న ఆస్పిరంట్ ప్రసాద రాజు

—కాంగ్రెస్ టికెట్ రేసులో ముందంజ

ప్రజాబలం ప్రతినిధి హనుమకొండ జిల్లా మార్చ్9: కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ స్థానానికి టికెట్ ఆశిస్తున్న వారిలో హన్మకొండకు చెందిన శివరాశి ప్రసాదరాజు తెరమీదికి రావడం ఆసక్తి రేపుతుంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు వివిధ పదవులు నిర్వహించిన ప్రసాదరాజు పార్టీ టికెట్ రేసులో ఉండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వరంగల్ స్థానానికి టికెట్ ఆశిస్తున్న ఆయన ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి అని చెబుతున్నారు. గతంలో ఆయన పార్టీ తరఫున వివిధ పదవులు నిర్వహించారు.1965-69 కాలంలో వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.1987-99వరకు వరంగల్ మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. అదే కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా సేవలందించారు.1989 నుండి 1991, 1996 వరకు జరిగిన అసెంబ్లీ,లోక్ సభ అభ్యర్థుల విజయానికి ఎనలేని కృషి చేశారు.1987-1992 వరకు వరంగల్ నగర ప్రజలకు మంచినీటి సరఫరా దోమల నిర్మూలన, వీధిలైట్లు, రోడ్లు, పార్కుల అభివృద్ధి తదితర అభివృద్ధి పనులు చేసి నగర ప్రజల మన్నలను పొందారు. కూరగాయల వ్యాపారులకు రుణాలు మంజూరు చేయించారు.

 

రిక్షా పుల్లర్లకు, హమాలీలకు ఉపాధి అవకాశాలు కల్పించారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా నియోజకవర్గ అభివృద్ధి కర్తవ్యం గా భావించే ప్రసాదరాజుకు పార్టీ టికెట్ ఇస్తే భారీ మెజారిటీతో గెలవడం తధ్యమని నగర ప్రజల్లో మరియు గ్రామీణ ప్రజల్లో చర్చ జరుగుతుంది.2000 నుండి 2002 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టెలికాం శాఖ డైరెక్టర్ గా పని చేసిన ఆయన విద్యావంతుడు కావడం, ప్రజల్లో సుపరిచితుడు కావడం ఆయన గెలుపుకు దోహద పడవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా 2006లో హైదరాబాదులో నిర్వహించిన కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాల్లో ఈయన కన్వీనర్ సభ్యునిగా ఉండి పార్టీ అగ్ర నాయకులలో గుర్తింపు పొందారు. వరంగల్ లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ అన్నీ అర్హతలు ఉన్న ఆస్పిరెంట్ ప్రసాద రాజు అని ప్రజల్లో చర్చ జరుగుతుంది. ప్రజల కోసం అహర్నిషలు కృషి చేసే ఆయనకు టికెట్ రావాలని ఆశిద్దాం. తనను పార్టీ గుర్తించి తనకే టికెట్ ఇస్తుందని ప్రసాదరాజు ధీమాతో ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking