28 నా జాతీయ లోక్ అందాలతో కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి

లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుంది

రాజీ మార్గమే రాజా మార్గం

పోలీస్ కమిషనర్ ఐపిఎస్ ఐజీ ఎం‌ శ్రీనివాస్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 25 : 28న జాతీయ లోక్ అదాలత కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుంది.రాజీమార్గమే రాజామార్గం పోలీస్ కమిషనర్ ఐపిఎస్ ఐజీ ఎం శ్రీనివాస్
రాజీమార్గం రాజమార్గమని, కక్షకారుణ్యాలతో ఏమీ సాధించలేమని,రాజీపడితే ఇద్దరూ గెలిచినట్లేనని రామగుండం పోలీస్ కమిషనర్ ఐపిఎస్ ఐజీ ఎం‌ శ్రీనివాస్ అన్నారు.ఈ మేరకు బుధవారం రోజున పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఈ నెల 28వ తేదీన జరుగనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షి దారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు. రాజీపడదగిన కేసులలో క్రిమినల్ కంపౌండ బుల్ కేసులు,సివిల్ తగాదా కేసులు,ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వాహణ కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు,బ్యాంకు రికవరీ,టెలిఫోన్ రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం,చెక్ బౌన్స్ కేసులో,ఇతర రాజీ పడ్డ దగిన కేసుల్లో కక్షిదారులు రాజీ పడాలని సూచించారు.రాజీ మార్గం రాజ మార్గ మని చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దని సూచించారు. జుడిషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.పోలీస్ అధికారులు కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుల్లు, పోలీస్ సిబ్బంది రాజీపడ్డ దగిన కేసులను లను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ పడేటట్లు అవగాహన కల్పించాలని సూచించారు.లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking