బీజేపీ,బీఆరెస్ నేతలు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుపై చేసిన తప్పుడు విమర్శలను కాంగ్రెస్ నేతలు

నస్పూర్ మున్సిపల్ చైర్మన్ వేణు,పీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 24 : బీజేపీ,బీఆరెస్ నేతలు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుపై చేసిన తప్పుడు విమర్శలను కాంగ్రెస్ నేతలు ఖండించారు. అభివృద్ధి చూసి ఓర్వలేకనే ఎమ్మెల్యే పై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహించారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్ వేణు,పీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి మాట్లాడారు.మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు,బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రావు లపై మండిపడ్డారు. ఎమ్మెల్యే కమీషన్ల కోసం గోదావరి నదిపై బ్రిడ్జి అడ్డుకుంటున్నాడని చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేశారు. మంచిర్యాల లో ట్రాఫిక్ సమస్య ఏర్పడవద్దనే ఉద్దేశ్యంతో ముల్కళ్ల నుంచి బ్రిడ్జి నిర్మించాలని ఎమ్మెల్యే సంకల్పించారన్నారు. కష్ట పడి డబ్బు సంపాదించిన వ్యక్తి ప్రేమ్ సాగర్ రావు అని తెలిపారు.మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రగిలించాలని ప్రయత్నించడం తగదని సూచించారు. తప్పుడు ప్రచారానికి పూనుకుంటే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ రాదని హితవు పలికారు.కాప్రా స్థలంపై వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని అన్నారు.స్థలం వివాదం కోర్టు పరిధిలో ఉందని,ఇప్పటికే ప్రేమ్ సాగర్ రావు పక్షాన పలు తీర్పులు వచ్చాయని గుర్తు చేశారు.నడిపెల్లి విజిత్ రావు ప్రేమ్ సాగర్ రావుపై పోటీ చేస్తానని సవాల్ చేయడం విడ్డురంగా ఉందన్నారు.దమ్ముంటే తనపై పోటీ చేయాలని వేణు ప్రతిసవాల్ చేశారు. దివాకర్ రావు వృద్ధుడు అయ్యాడని రాజకీయాల నుంచి నిష్క్రమించడం ఉత్తమమని అన్నారు. దివాకర్ రావు చేసే ఆరోపణలలో పస లేదని ఎద్దేవాచేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking