వయోవృద్ధుల సంక్షేమం కోసం పోషణ నియమావళి కార్యక్రమం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 25 : వయోవృద్ధుల పోషణ,సంక్షేమం కోసం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పోషణ సంక్షేమ నియామవళి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.బుధవారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్లో ఇన్చార్జ్ జిల్లా సంక్షేమశాఖ అధికారి స్వరూపారాణి, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సభ్యులు మహేందర్ లతో కలిసి సంక్షేమ నియమావళి-2011 కార్యక్రమ సంబంధిత గోడప్రతులను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… అక్టోబర్ 1వ తేదీన అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 25 నుండి 30వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.26న వృద్ధాశ్రమాలు, డే కేర్ సెంటర్లలో వయోవృద్ధుల క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు,27న ఓవర్ బ్రిడ్జి నుండి ముఖరాం చౌరస్తా వరకు వాకతాన్ ర్యాలీ, 28న తల్లిదండ్రుల పోషణ చట్టం-2007,ఆరోగ్య సంరక్షణపై అవగాహన సదస్సు,29న అంగన్వాడీ కేంద్రాలలో, పాఠశాలల్లో గ్రేండ్ పేరెంట్స్ డే, 30న సర్పంచ్,పంచాయతీ కార్యదర్శులకు తల్లిదండ్రుల పోషణ, సంరక్షణ చట్టం-2007, వయోవృద్ధుల లైన్ టోల్ ఫ్రీ నం.14567పై అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, పోషణ -సంరక్షణ చట్టంపై వృద్ధులు అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో హబ్ సమన్వయకర్త సౌజన్య,డి.సి.పి.యు.ఆనంద్, సీనియర్ అసిస్టెంట్ స్వరూపారాణి,ఫీల్డ్ రెస్పాన్స్ అధికారి ఎండి.ఫర్జానా బేగం, రాజ్యలక్ష్మి,వసంత, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ సభ్యులు హనుమంతు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking