విద్యార్థులు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక తో విజయం సాధించాలి.

 

నలందా విద్యా సంస్థల అధినేత డాక్టర్ పి.వి రమణ.

ఘనంగా తూప్రాన్ నలంద జూనియర్ కాలేజీలో ఫ్రేషర్స్ డే వేడుకలు.

తూప్రాన్, సెప్టెంబర్,25. ప్రాజబలం న్యూస్ :-

విద్యార్థులు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక తో విజయం సాధించాలని నలందా విద్యా సంస్థల అధినేత డాక్టర్ పి.వి రమణ పిలుపు నిచ్చారు. బుధవారం మెదక్ జిల్ల గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ నలంద జూనియర్ కాలేజీలో ఫ్రేషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పివి రమణ, మాట్లాడుతూ తమ నలందా కళాశాలలో నూతనంగా మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థుల లో మనోధైర్యం తోపాటు అదనంగా విజ్ఞానాన్ని పెంచే దిశగా విద్యా పరంగా, సామాజికంగా, మానసికంగా ఎదిగే విధంగా రూపొందించిన ఈ ఫ్రెషర్స్ డే వేడుకలు స్ఫూర్తి కలిగించి దోహదపడుతుందని అన్నారు. అంతే కాకుండా విద్యార్థుల్లో సమగ్ర పరివర్తన లో విజయం సాధించడానికి సైతం ఈ ఫ్రెషర్స్ డే ఎంతో మేలు చేస్తాయని అన్నారు. తూప్రాన్ లోని నలందా కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు కొత్తగా వచ్చిన వారిని ఆహ్వానించారు. అనంతరం ర్యాంప్ వాక్ నిర్వహించారు. డీజే చప్పుళ్లకు, సినిమా పాటలకు నృత్యాలు ఫ్రెషర్స్ డే హంగామా చేస్తూ ఆకట్టుకున్నారు. నలంద జూనియర్‌ కళాశాలలో ఫ్రెషర్స్‌ డే వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన సీనియర్ జర్నలిస్ట్ జానకిరామ్ సి ఆర్ మాట్లాడుతూ ఆర్థిక లాభాల కోసం ఆశించకుండా అమ్మాయిల కోసం ప్రత్యేకంగా జూనియర్‌ కళాశాల నెలకొల్పి కార్పొరేట్‌ స్థాయి విద్యనందిస్తూ, ఇతర కళాశాలలకు దీటుగా ర్యాంకులను సాధిస్తున్న కళాశాల అధ్యాపకులు, విద్యార్థులను అభినందించారు. లాభాపేక్ష లేకుండా ఉన్నత చదువునందిస్తున్న కళాశాల కరస్పాండెంట్‌ డాక్టర్ పి.వి రమణ, కరస్పాండెంట్ నలంద కళాశాలల ఇంచార్జ్
పట్లూరి రవీందర్
పటేల్ ను ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్ లను ప్రత్యేకంగా అభినందించారు. ఇంటర్మీడియట్‌లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మెమెంటోలు ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు శ్రీనివాస్, ప్రసాద్, నరేష్, తెలుగు శ్రీనివాస్, ఎకనామిక్స్ శ్రీనివాస్, సత్యం, శ్రీకాంత్ గౌడ్, ప్రశాంతి, ఐక్షిత, నందిని, కవిత, శ్రీలేఖ, నరేష్ తోపాటు విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking