జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు

జిల్లా ఎస్.పి డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్

ప్రజాబలం – మెదక్ జిల్లా ప్రతినిధి 31 ఆగస్టు 2024 :

మెదక్ జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని (సెప్టెంబర్ 01 వ తేది నుండి 30 వ తేదీ వరకు) పాటు జిల్లా వ్యాప్తం గా 30,30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని మెదక్ జిల్లా ఎస్.పి శ్రీ. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్ తెలిపినారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లాలో ప్రజలు ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపినారు. అలాగే ప్రజా ధనాన్ని నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్.పి. గారు హెచ్చరించారు. కాబట్టి జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు తమకు ఈ విషయంలో సహకరించాలని తెలిపినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking