మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆగస్టు 31:
పల్లె దవఖానాలలో ఒపి పెషంట్ల సంఖ్యను పెంచేలా ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి పల్లె దవఖానా అందించే వైద్య సేవల గురించి ప్రజలకు అవగాహాన కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ను మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం ఆదేశించారు.
శనివారం శామీర్ పేట్ మండలంలోని ఆలియాబాదులోని పల్లె దవఖానాను కలెక్టర్ తనిఖీ చేసారు. పల్లెదవఖానాను పరిశీలించి రోజుకు ఎంత మంది ఓపి పెషంట్లు వస్తారని కలెక్టర్ మెడికల్ ఆఫీసర్ ను అడిగి తెలుసుకున్నారు. ఒపి పెషంట్ల సంఖ్యను పెంచేలా ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి పల్లె దరఖానా అందించే వైద్య సేవల గురించి ప్రజలకు అవగాహాన కల్పించాలని కలెక్టరు ఆదేశించారు. పల్లె దవఖానాలో ఎంత మంది సిబ్బంది ఉన్నారని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పల్లెదవఖాలలో అందించే వైద్య సేవల రికార్డుల గురించి అడిగి రిజిష్టర్లను పరిశీలించారు. ప్రసవాల సంఖ్య, వ్యాక్సినేషన్, ఇమ్యూనైజేషన్ గురించి అడిగి వాటి నమోదు రిజిష్టర్లను తనిఖీ చేసారు. రిజిష్టర్లలలో నమోదు సరైన విధంగా లేవని, ఎప్పటి రికార్డులను అప్పుడే నమోదు చేయాలని రిజిష్టర్లలలో ఖాళీలు ఉండకూడదని సూచించారు. ఈడిడి క్యాలెండరును , వంద కాలమ్ రిజిష్టరును తప్పనిసరిగా నిర్వహించాలని మెడికల్ ఆఫీసర్ ను ఆదేశించారు. ప్రసవాల సంఖ్యను, వ్యాక్సినేషన్ ను పెంచాలన్నారు. లేబర్ రూమ్ ను పరిశీలించి ప్రసవాలకు అవసరమైన నవీకరణయంత్రాలను తెప్పించుకోవాలని కలెక్టర్ సూచించారు. మందుల గదిని పరిశీలించి మందుల నమోదు రిజిష్టర్లను, పేషంట్లకు మందులు అందించిన రిజిష్టర్లను తనిఖీ చేసి గత నాలుగు నెలలుగా పేషంట్లకు మందులు ఇచ్చిన రికార్డుల నమోదు సరిగా లేదని కలెక్టరు అసంతృప్తి వ్యక్తం చేసారు.రిజిష్టర్ల నిర్వహాణకు తగిన చర్యలు తీసుకోవాలని మెడికల్ ఆఫీసర్ ను కలెక్టరు ఆదేశించారు.
అనంతరం కలెక్టర్ శామీర్ పేట్ లోని సామాజిక ఆరోగ్య కేంద్రం ను తనిఖీ చేసి, అక్కడ ఉన్న వైద్య సిబ్బంది ఎంత మంది ఉన్నారు అని అడిగి తెలుసుకున్నారు. పేషంట్లకు అందించే సేవలను మెరుగు పరిచి మరింత విస్తృతం చేయాలని వైద్యులకు సూచించారు. ఆసుపత్రిలో ఉన్న డెంటల్, ల్యాబ్ విభాగాలు పరిశీలించి వాటి పనితీరును డాక్టర్లతో అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిని తనిఖీ చేస్తూ ల్యాబ్ రిజిస్టర్లను,రికార్డులను కలెక్టర్ పరిశీలించారు.రోజుకు ఎన్నిర్యాపిడ్ కిట్లను ఉపయోగిస్తారని అడిగి, వారానికి కనీసం 1500 వందల కిట్లను ఉపయోగించాలని సూచించారు. లేబర్ రూం పరిశీలించి హైడ్రాలిక్ డెలివరీ టేబుల్ ను తెప్పించుకోవాలని, అందుకు అవసరమైన నిధుల కోసం ప్రణాళిక తయారు చేసి నివేదిక పంపాలని కలెక్టరు తెలిపారు. ఆసుపత్రికి అవసరమైన మరమ్మత్తులను చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ రఘునాథస్వామి, శామీర్ పేట్ ఎంపిడిఓ మమతా బాయి, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.