బీజేపీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315 వ వర్ధంతి

 

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 02(ప్రజాబలం)సంగారెడ్డి జిల్లా/సంగారెడ్డి:భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 315 వ వర్ధంతిని పురస్కరించుకొని వారికి పట్టణ అధ్యక్షులు ద్వారకా రవి ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాజేశ్వరరావు దేశ్పాండే గారు మాట్లాడుతూ బహుజన ముద్దుబిడ్డ వీరుడు సర్దార్ పాపన్న గారి విధంగా బహుజనులందరూ రాజ్యాధికారం చేపట్టాలని. యువత ముఖ్యంగా వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజు గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి మొఘల్ సామ్రాజ్యం పైన దండయాత్ర చేసి మొట్టమొదటిగా బహుజన సామ్రాజ్యాన్ని స్థాపించి తన పరిపాలన దక్షిణ చూపినటువంటి గొప్ప మహనీయుడు సర్దార్ పాపన్న దొరగాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు విట్టల్ గౌడ్, మాజీ కౌన్సిలర్ మందుల నాగరాజు,శ్రీనివాస్ రెడ్డి, మీనా గౌడ్ ,ద్వారకా శివ ,రాము, తేజశ్రీ, మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking