ప్రజా ఏక్తా పార్టీ గ్రేటర్ హైదరాబాదు అధ్యక్షుడిగా నర్సింగ్ రావు

 

నర్సింగ్ రావుకు నియామకపత్రం అందజేసిన బోనాల శ్రీనివాస్

ప్రజా ఏక్తా పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా కార్వాన్ కు చెందిన వి నర్సింగ్ రావు నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం మహారాజ్ గంజ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు బోనాల శ్రీనివాస్ వి నర్సింగ్ రావుకు నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నర్సింగ్ రావు మాట్లాడుతూ… నగరంలో పార్టీని మరింత పటిష్ఠం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మణికంఠ, ముఖేష్ మేరు, రాఖేష్, శ్రీనివాస్, నాగేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking