యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేల పోటీలు. డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సాంబమూర్తి…

 

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 6:

భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంలో భాగంగా సంక్రాంతి సంబరాలలో యువజన క్రీడలను నెల రోజులపాటు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలలో భాగంగా క్రికెట్ క్రీడలో 30 జట్లు పాల్గొని ఉత్తమ ప్రదర్శనను ప్రదర్శించాయి. చివరగా ఫైనల్ మ్యాచ్లో భాగంగా సోమవారం బెస్తం చెరువు, మామునూరు జట్ల మధ్య జరిగిన పోటీలో మామునూరు జట్టు మొదటి బహుమతి ట్రోఫీ గెలుచుకొని 25 వేల నగదును అందుకుంది రన్నరపుగా నులిచిన బెస్టామ్ చేరువు జట్టు పదివేల నగదు బహుమతిని అందుకుంది ట్రోఫీ, నగదు ప్రధానం చేసిన అనంతరం భారత ప్రజాతంత్ర యువజన సమైక్య వరంగల్ జిల్లా కార్యదర్శి సాంబమూర్తి మాట్లాడుతూ నిరుద్యోగం తో కొట్టుమిట్టాడుతున్న యువత లో మనో ధైర్యాన్ని నింపే విధంగా క్రీడా పోటీలను నిర్వహించడం జరిగిందని ఈ పోటీలలో యువత ఉల్లాసంగా పాల్గొన్నారనీ అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కమిటీ సభ్యులు రాజేష్, బొక్క చరణ్, వలి ప్రవీణ్, నరసింహ రాజు, చింటూ, సునీల్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking