అధికార పార్టీ సర్పంచ్ కబ్జాకోరు,టేకుర్ గ్రామం

 

ప్రజ బలం ప్రతినిది సంగారెడ్డి:06
బహుజన్ సమాజ్ పార్టీ న్యాల్కల్ మండల్ ప్రెసిడెంట్ సంగ్రామ్ ఆధ్వర్యంలో
టేకురు గ్రామంలో గల పాత అంగన్వాడి కేంద్రం పక్కనగల పశువుల తొట్టి మరియు త్రాగునీటి బోరు ఉండేది అవి ప్రస్తుతం కబ్జాలో ఉన్నవి వాటిని కబ్జా చేసిన వారు బీ.మానయ్య s/0సంగప్ప అనే వ్యక్తి కబ్జాలో ఉన్నాడు. అదేవిధంగా గ్రామంలో గల మజీద్ వెనుకలో పశువుల తొట్టిని కూడా కబ్జా చేశారు కబ్జా చేసిన వారు టేకుర్ గ్రామ సర్పంచ్ అయినటువంటి మొహమ్మద్ అమీర్ సన్నాఫ్ మహబూబ్ సాబ్ అనే వ్యక్తి పశువులతొట్టి తొలగించి న స్థలం వ్యక్తిగత పనులకు వాడుతున్నాడు. అలాగే మరియు పురాతన అంగన్వాడి కేంద్రం మరియు పాఠశాలను, గ్రామపంచాయతీ ట్రాక్టర్ ను వ్యక్తిగతతో పనులకు వాడుతున్నారు, ఇటీవల ఈ విషయం పై పంచాయతీ కార్యదర్శి కి మరియు ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కానీ ఏ చర్యలు తీసుకో లేదు,కావున కబ్జా కోరుల పై చట్టపరమైన చర్యలు తీసుకోగలరని మా యొక్క మనవి.
ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ న్యాల్కల్ మండల్ ప్రెసిడెంట్
P. సంగ్రామ్, న్యాల్కల్ మండల్ వైస్ ప్రెసిడెంట్, B. రాహుల్ టేకుర్ గ్రామ కన్వీనర్,
S. శ్రీకాంత్.ఎం దావీదు. బి. రాజు హున్నాపూర్ రాజకుమార్ బీఎస్పీ గ్రామ కమిటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking