ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 06 : మంచిర్యాల పురపాలక సంఘం పరిధిలోని తిలక్ నగర్ లో హాథ్ సే హాత్ జోడో కార్యక్రమం కు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ శ్రీకారం చుట్టారు.సోమవారం తిలక్ నగర్ లో జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం పాదయాత్ర చేపట్టారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ విజయాలు,మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి సురేఖ వివరించారు.ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ రాహుల్ గాంధీ జూడోయాత్రకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ హాత్ సే హాత్ జోడో యాత్ర రెండు నెలలపాటు పాదయాత్ర గా కొనసాగుతుందని వివరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కొక్కిరాల సురేఖ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ,పట్టణ అద్యక్షులు తూముల నరేష్,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రావుల ఉప్పలయ్యా,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పుదరి తిరుపతి, మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ అధ్యక్షురాలు గజ్జెల హేమలత,డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మజీద్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు,కౌన్సిలర్ రామగిరి బాణేష్,యువజన కాంగ్రెస్ నియోజక వర్గ అద్యక్షులు సల్ల మహేష్,ఓబిసి సెల్ జిల్లా అధ్యక్షులు వడ్డే రాజమౌళి,గాండ్ల సత్తమ్మ,పుట్ట లావణ్య,లలిత, డిసిసి డెలిగేట్ ఆది సంజీవ్, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు షేర్ పవన్,ఎంపీటీసీ లు బాలరాజు,డేగ బాపు,తూముల వెంకటేష్,పుదరి ప్రభాకర్,బోల్లం భీమయ్య,పెంట రమేష్,చింతకింది మల్లయ్య,గట్టు స్వామి,భీమా గౌడ్, సంతోష్,శంకర్,రాజన్న,వెంకటేష్, అజయ్,ప్రకాష్,రఫీ,రమేష్, తిరుపతి,ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.