పోలీస్ శాఖకు 30 సంవత్సరాలు సేవలందించిన రాజ్ కుమార్ ను శాలువాతో ఘనంగా సత్కరించి వీడ్కోలు తెలిపిన …జిల్లా అదనపు ఎస్పీ టీ ఉషావిశ్వనాథ్

 

ప్రజ బలం ప్రతినిది సంగారెడ్డి:06
గత 30 సంవత్సరాలుగా పోలీసు శాఖకు సేవలందించిన హోంగార్డు రాజ్ కుమార్ రిటైర్మెంట్ ను పురస్కరించుకొని శాలువాతో ఘనంగా సత్కరించి ఘనంగా వీడ్కోలు తెలిపిన జిల్లా అదనపు యస్.పి. శ్రీమతి టి. ఉషావిశ్వనాథ్ .
పోలీసు శాఖకు అనుబంధంగా ఉన్న స్వచ్ఛంద సంస్థ హోంగార్డ్ వ్యవస్థ. ఈ హోంగార్డ్ వృత్తిలో గత 30 సంవత్సరాల క్రితం భర్తీ అయిన రాజకుమార్ హోంగార్డు నేటితో అతని వయస్సు 60 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా హోంగార్డు వృత్తి నుండి రిటైర్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా అదనపు యస్.పి. మాట్లాడుతూ హోంగార్డ్ రాజ్ కుమార్ పోలీసు శాఖకు అందించిన సేవలను కొనియాడారు. రిటైర్మెంట్ అనంతరం ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మిగిలిన శేష జీవితం అతని కుటుంబంతో సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను అన్నారు. పోలీస్ శాఖ తరపున అతనికి ఎల్లవేళలా సహాయ, సహకారం అందింస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మహేష్ గౌడ్, యస్.బి. ఇన్స్పెక్టర్, రామరావ్ ఆర్.ఐ., మరియు హోంగార్డ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking