రాజ్యాధికారమే లక్ష్యంగా ఖేడ్ అన్ని మండల, గ్రామాల్లో యాత్ర
పల్లె పల్లె కు బీఎస్పీ ప్రగతి భవన్ కు అరెస్పీ అనే నినాదంతో
24 న మంజీర నది ఒడ్డున నుండి యాత్ర ప్రారంభం
బీఎస్పీ నియోజకవర్గ ఇంఛార్జి లు బోర్గి భీమన్న, పండరీ లు
…..*బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు అలిగే జీవన్ కుమార్
ప్రజ బలం ప్రతినిది సంగారెడ్డి:06
నారాయణఖేడ్ నియోజకవర్గ o పుక్కుర్తి మంజీర నది ఒడ్డున నుండి బహుజన రాజ్యాధికార పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు నియోజకవర్గ ఇంఛార్జి లు బోర్గి భీమన్న, పండరీ, నియోజకవర్గ అధ్యక్షుడు అలిగే జీవన్ కుమార్ తెలిపారు . ఈ సందర్భంగా బోర్గి భీమన్న మాట్లాడుతూ పవిత్ర పుణ్య క్షేత్రం మంజీర నది నుండి ఫిబ్రవరి 24 న మధ్యాహ్నం 2 గంటల కు బహుజన రాజ్యాధికార పాదయాత్ర ప్రారంభిస్తామని, ఈ యాత్ర మనూర్, నగిలిగిద్ద, కంగ్టి, సిర్గాపూర్, కల్హేర్, నిజాంపేట్, శంకరంపేట్, నారాయణఖేడ్ మండలాల మీదుగా యాత్ర కొనసాగుతుందని అన్నారు.అన్ని మండలాలు, గ్రామాలు మీదుగా నారాయణఖేడ్ చేరుకుని తహసీల్దార్ గ్రౌండ్ లో భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా .ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. రాజ్యాధికారమే లక్ష్యంగా ఖేడ్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండల, గ్రామాల్లో యాత్ర సాగుతుందని ,తెలంగాణ రాష్ట్రo ఏర్పడిన తరువాత కూడా ఇంకా బహుజనుల బతుకులు మారలేవని, స్వతంత్ర o వచ్చి 75 సం,,రాలు గడిచిన ఖేడ్ ప్రజలు ఇంకా బానిసత్వం లో నే ఉన్నారని బీసీ, ఎస్టీ, ఎస్సి,మైనార్టీ,అగ్రవర్ణాల పేదల బతుకులు మరలేవని బహుజనుల బతుకులు మారాలంటే బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి రావాలని, కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజల కు మోసం చేసారని, బహుజన సమాజ్ పార్టీని అధికారంలోకి తేవడానికి ఇంటింటికి ఏనుగు గుర్తు ను తీసుకెళ్లి ప్రభుత్వ వైఫల్యం ను ఎండగడతామని అన్నారు ఈ యాత్ర ను ప్రజలు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి శంకర్, కోశాధికారి ప్రకాష్, మనూర్ అధ్యక్షుడు తుకారం, నిజాం పెట్ అధ్యక్షుడు సాయిలు, ,తదితరులు పాల్గొన్నారు
Next Post