ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 06 : మంచిర్యాల జిల్లా లోని దండేపల్లి మండలంలోని భారతీయ జనతా పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు గోపతి రాజయ్య ఆధ్వర్యంలో పార్టీ జెండాను గురువారం ఎగురావేశారు,ఈ సందర్బంగా మండల అధ్యక్షుడు గొపతి రాజయ్య మాట్లాడుతూ… భారతీయ జనతా పార్టీ భారత దేశంలో కార్యకర్తలతో కూడుకున్న పార్టీ దేశ రక్షణ కు పనిచేసే పార్టీ ఇద్దరు ఎంపీ లతో మొదలైన బీజేపీ ముడువందల మూడు ఎంపీ లకు చేరుకొని ప్రపంచం లోనే అగ్రగ్రామీగా నిలుస్తన్న పార్టీ బీజేపీ అని కొనియాడారు,ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ముస్కె కార్తీక్,మండల కోశాధికారి గుండ రవీందర్,మండల ఉపాధ్యక్షులు అంబడి సురేందర్,మండల ప్రధాన కార్యదర్శి బందెల రవి,శక్తి కేంద్ర ఇంచార్జ్ ముత్తినేని మల్లేష్,బూత్ అధ్యక్షులు గొల్ల మల్లేష్,టెకమట్ల గురువయ్య,ఇమిడిచట్టి శ్రీనివాస్, కుదురుపాక బీమయ్య,మల్లూరి లక్ష్మి నారాయణ,బూమేష్ రాజు, తదితరులు పాల్గొన్నారు.