జై హిందుస్తాన్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మాడా రాజ

హైదరాబాద్, ఏప్రిల్ 6 ;జై హిందుస్తాన్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గా మాడా రాజ నియమితులైనారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షులు తుమ్మా ఓంకార్ నియామక పత్రాన్ని అందజేశారు. హైదేవ్రాబాద్ ఉప్పల్ కు చెందినా మాడా రాజ సామాజుక సీవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ,పేదవర్గాల అబ్యున్నతి కోసం పోరాటం చేస్తున్నారు. అతని సీవాలను గుర్తించిన జాతీయ అధ్యక్షులు తుమ్మా ఓంకార్ రాజను రాష్ట్ర అధ్యక్షునిగా నియ మిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మాడా రాజ మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలకు,రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తానని అన్నారు. ముక్యంగా సమాజం లోని ప్రజల సమస్యల పరిష్కారం కొరకు పోరాడుతానని పేర్కొన్నారు. తన పై గల నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. బాధ్యతతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఈసందర్బంగా పార్టీ జాతీయ అధ్యక్షులు తుమ్మా ఓంకార్ మాడా రాజ కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking