ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 06 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణ పరిధిలోని స్థానిక ప్రోహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ లో వివిధ కేసులలో జప్తు చేయబడిన 11 ద్విచక్ర వాహనములకు ఈ నెల 11వ తేదీన ఉదయం 11గంటలకు జిల్లా ప్రోహిబిషన్ ఎక్సైజ్ అధికారి సమక్షంలో బహిరంగ వేలం పాట నిర్వహించబడునని ప్రోహిబిషన్ ఎక్సైజ్ ఎస్సై బాబా తెలిపారు. ఆసక్తి గల వారు వేలంపాటలో పాల్గొనవచ్చునని,వాహనాలకు సంబంధించి పూర్తివివరాలకు స్థానిక స్టేషన్ లో సంప్రదించలన్నారు.