నేషనల్ కన్జ్యూమర్ రైట్ కమిషన్ వరంగల్
వరంగల్ ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 06:
వినియోగదారుల్లో చైతన్యం నింపడమే లక్ష్యంగా ది నేషనల్ కన్జ్యూమర్ రైట్ కమిషన్ ముందుకు వెళుతున్నదని వినియోగదారుల హక్కులు, వారికి జరుగుతున్న మోసాల పట్ల అవగాహన ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లాల్సిన బాధ్యత ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా పైన కూడా ఉన్నదని ది నేషనల్ రైట్ కమిషన్ ఫౌండర్ చైర్మన్, డాక్టర్ సాయి రమేష్, అడ్మినిస్ట్రేషన్ జాతీయ చైర్మన్ రామానుజ స్వామి అన్నారు. వినియోగదారులకు వస్తువు కొనుగోలు చెల్లింపులపై జరుగుతున్న మోసాలకు సంబంధించిన కరపత్రాలను ది నేష్నల్ కన్జ్యూమర్ రైట్ కమీషన్ వరంగల్ చైర్మన్ దేవ సాంబమూర్తి ఆధ్వర్యంలో గురువారం వరంగల్ చౌరస్తాలోని వినాయక గ్రాండ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రీజినల్ చైర్మన్ గా సాంబమూర్తిని ప్రకటించడంతోపాటు నూతన మెంబర్లకి సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. అనంతరం విలేకరులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కన్జ్యూమర్ రైట్స్ అంటేనే వినియోగదారుల హక్కులు అంటే ఏంటో తెలుసుకోవాలని 1986 లో వచ్చిన కన్జ్యూమర్ యాక్ట్ చట్టంపై నేటికీ ఎవరికి అవగాహన లేకపోవడం బాధాకరమని అన్నారు. వస్తువుని మార్కెట్లోకి తీసుకొచ్చిన అనంతరం ఆమ్మకం దారులు అధిక లాభాలతో వినియోగదారులను ఆకర్షించి మోసం చేస్తున్నారని అన్నారు. డబ్బులకు తగ్గ సరుకులు ఇస్తున్నారో లేదా చూసుకోవాల్సిన బాధ్యత కొనే వ్యక్తి పైన ఉన్నదని వస్తువు ధర, తూకం, నాణ్యత, స్వచ్ఛత, పైన ప్రశ్నించే హక్కు ప్రతి వినియోగదారుడు కలిగి ఉన్నడనీ అన్నారు. మోసపోయినట్లు తెలిస్తే న్యాయపోరాటం చేయవచ్చని వినియోగదారులను మోసం చేస్తే శిక్షించే అనేక చట్టాలు ఉన్నాయని ఆ చట్టాల పైన ప్రజల్లో అవగాహన కలిగించి కోర్టు ల ద్వారా న్యాయం అందించడమే బాధ్యతగా ది నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ ముందుకు పోతుందని అన్నారు.
*వరంగల్ జిల్లా వినియోగదారులకు అండగా ఉంటూ వారి తరఫున పోరాడటానికి ది నేషనల్ కన్స్యూమర్ రైటు కమిషన్ వరంగల్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని అన్నారు. తమకు ఏ విషయంలోనైనా మోసపోయినట్లు వినియోగదారులు గ్రహిస్తే 24 గంటలు పని చేసే జాతీయ టోల్ ఫ్రీ నెంబర్ 8019493419 కి కాల్ చేసి తమను సంప్రదించొచ్చని కన్జ్యూమర్ కోర్టులో ఏ విధంగా పోరాడాలో తాము మార్గాన్ని చూపెడతామని ది నేషనల్ కన్జ్యూమర్ రైటు కమిషన్ వరంగల్ చైర్మన్ దేవ సాంబమూర్తి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ రామ్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, సెక్రెటరీ శ్రీజేయం చారి, జాయింట్ సెక్రటరీ దేవా సతీష్ , జాయింట్ సెక్రెటరీ శ్రీ ఎం జగదీశ్వర్ , మెంబర్స్ పుల్లూరి వీరన్న, వల్లాల శైలజ, ఆకుల శంకర్ లింగం, ఎం విజయ్ కుమార్, పాల్గొన్నరు.