భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 125 అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణ ఏప్రిల్ 14
మేడ్చల్ జిల్లా ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 6: భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 125 అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణ ఏప్రిల్ 14
న వైభవోపేతంగా జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు.
గురువారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి గొర్రెల పంపిణీ, అంబేడ్కర్ జయంతి వేడుకలపై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ కలెక్టర్ అమోయ్ కుమార్,అదనపు కలెక్టర్ లు నర్సింహారెడ్డి ,అభిషేక్ అగస్త్య, లతో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుండి పాల్గొన్నారు.
అంబేద్కర్ విగ్రహావిష్కరణ వేడుకలో ప్రజలను భాగస్వాములు చేయాలి: మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్
వీడియో కాన్ఫరెన్స్ అనంతరము జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులకు గొర్రెల పంపిణీ, అంబేద్కర్ జయంతి పై పలు సూచనలు చేశారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 300 మంది అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణకు హాజరయ్యెలా చర్యలు తీసుకోవాలని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 6 బస్సులతో ప్రజలను తరలించాలని, స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ మండల కేంద్రం నుంచి బస్సులు నడపాలని తెలిపారు.
అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణకార్యక్రమానికి తప్పనిసరిగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు హైదరాబాద్ కు ప్రజలు చేరుకునే విధంగా జిల్లా స్థాయిలో ప్రణాళిక తయారు చేసుకోవాలని అధికారుల కు సూచించారు. ప్రజలకు ఆ రోజు టిఫిన్, లంచ్, డిన్నర్ ఏర్పాట్లు చేయాలని, ప్రతి బస్సులో పోలీస్ అధికారి, ప్రభుత్వ అధికారినీ నియమించి బాధ్యతలు అప్పగించాలని, బస్సు తిరిగి మండల కేంద్రాలకు చేరే వరకు జిల్లా స్థాయిలో మానిటరింగ్ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రజల తరలింపు సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ పాల్గోనే ప్రజల వివరాలు ఏప్రిల్ 10 నాటికి సేకరించాలని, ప్రతి మండల పరిధిలో వెళ్ళె బస్సులో అవసరమైన స్నాక్స్, వాటర్ బాటిల్, బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి మండల కేంద్రంలో ఉదయం 6గంటల వరకు బస్సు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, ఇద్దరు డ్రైవర్లు తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, జెడ్పీ సిఈవో దేవసహయం,. జిల్లా పశువైద్యాధికారి శేఖర్, ఆర్డీవోలు రవి, మల్లయ్య, డిఆర్డిఓ పద్మజారాణి డిపిఓ రమణమూర్తి, జిల్లా ఏస్సి వెల్ఫేర్ అధికారి వినోద్, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
