మున్సిపల్ కమిషనర్ కల్లేడ రాజశేఖర్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 08 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలో మున్సిపల్ పరిధిలోని ఆస్తి పన్ను ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ 2024-2025 సంవత్సరానికి గాను ప్రస్తుత సంవత్సరం ఆస్తి పన్ను లో 5% రిటెట్ మంజూరు చేసిందని లక్షెట్టిపేట మున్సిపల్ కమిషనర్ కల్లేడ రాజశేఖర్ అన్నారు. సోమవారం ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ… లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని 2024-2025 ఆర్థిక సంవత్సరం గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత సంవత్సరం ఆస్తి పన్ను లో 5% రిటెట్ చెసింది కావునా ఈ అవకాశం కేవలం 30-04-2024 వరకు మాత్రమే వర్తించును,కావున లక్షెట్టిపేట పట్టణంలోని ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం పరుచుకొని మీ యొక్క ఇంటి పన్నులు చెల్లించి లక్షెట్టిపేట పట్టణ అభివృద్ధికి సహకరించాలని తెలుపారు.