గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి.
కాంగ్రెస్ పార్టీలో చేరిన తూప్రాన్ ముదిరాజ్ సంఘం నాయకులు.
మెదక్ తూప్రాన్ ప్రజాబలం న్యూస్ :-
ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని సిద్దిపేట డిసిసి అధ్యక్షుడు నర్సారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని మున్సిపాలిటీ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ ఆధ్వర్యంలో తూప్రాన్ గ్రామ పెద్దలు మామిండ్ల లింగం, మామిండ్ల శ్రీనివాస్ , మాజీ ఎంపీటీసీ తిమ్మాపురం నరసింహులు , భాస్కర్ , నాగులు ఆంజనేయులు రమేష్ , ముదిరాజ్ సంఘం నాయకులు సుమారు 30 మంది కార్యకర్తలు గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తుంకుంట నర్సారెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తూముకుంట నర్సారెడ్డి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు నాయకులు కార్యకర్తలు కలసికట్టుగా పనిచేయాలని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు. త్వరలోనే పార్టీకి పునర్ వైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు మన ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు అధికారం పోయాక జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీనివాస్, కౌన్సిలర్లు కోడీప్యాక నారాయణ గుప్తా ,
శ్రీశైలం గౌడ్ , రవీందర్ గుప్తా , భగవాన్ రెడ్డి , రవీందర్ రెడ్డి, మున్సిపాలిటీ కౌన్సిలర్లు , పిఎసిఎస్ వైస్ చైర్మన్ దీపక్ రెడ్డి, తూప్రాన్ మండల ఆర్ఎంపీ
పి ఏం పిల అసోసియేషన్ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ అప్సర్, రాముని గారి నాగరాజుగౌడ్ , నర్సింగరావు, నరసింహారెడ్డి, ఇస్లాంపూర్ ఆకుల శ్రీరాములు, శశి భూషణ్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, బొల్లు నరేందర్, అజయ్ , దామోదర్ రెడ్డి, ఉమర్, అనిల్, శ్రీనివాస్, బాయికాడీ వెంకటేష్, శ్రీకాంత్, జింక మల్లేష్, తిరుపతి, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.