50 కోట్ల నిధులతో ప్రజా ప్రయోజనార్థం అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేసిన మంత్రులు

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 27 సెప్టెంబర్ 2025: తాండూరు నియోజకవర్గ శాసన సభ్యుడు పైలెట్ రోహిత్ రెడ్డి తన నియోజక వర్గంలో
వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి హరీష్ రావు, రాష్ట్ర భూగర్భ గనులు, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రా రెడ్డి, చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, శాసన సభ్యులు మెతుకు ఆనంద్, రోహిత్ తది తరుల సహకారాలతో 50 కోట్ల నిధులను ప్రజా ప్రయోజనార్థం అభివృద్ధి పనులకు శంకు స్థాపనలతో శ్రీకారం చుట్టడం జరిగినవని తాండూరు మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు తెలుపుతూ: 10.23 కోట్లతో జినుగుర్తి, కందనెల్లి, చంద్రవంచ, జుంటుపల్లి పరిధిలో విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం, 25 కోట్లతో నర్సింగ్ కాలేజ్ కి, 10 కోట్లతో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటి అభివృద్ధి పనులకు,1.50 కోటితో తాండూరు లైబ్రరీ నూతన భవనానికి, పట్టంలోని శాంతినగర్ లో ఈ-సేవా భవనంలోని ట్రాఫిక్‌ పోలీస్టేషన్‌కు, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానంతరం పట్టణంలోని విలియ మూన్ మైదానంలో కని విని ఎరుగని భారీ ప్రగతి ప్రస్థాన బహిరంగ సభ జరిగినదని అట్టి సభకు ఆట పాటలతో 1000 మంది కార్య కర్థలతో తను వెళ్ళడం జరిగిందని పట్లోళ్ల దీప నర్సింలు తెలిపినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking