కె కె – 5 గనిలో 55 వ రక్షణ పక్షోత్సవాలు

 

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ డిసెంబర్ 16 :

55 వ రక్షణ పక్షోత్సవాల లో భాగంగా సింగరేణి ఉన్నతాధికారులు సేఫ్టీ కమిటీ కన్వీనర్ బి.శ్రీనివాస రావు, జీఎం,(ఐ. అండ్. ఎం), ఏరియా జనరల్ మేనేజర్ జి.దేవేందర్, కె.రఘు కుమార్, (జి.ఎం సేఫ్టీ ఎల్లంపల్లి రీజియన్), సేఫ్టీ ఆఫీసర్ ఎం.రవీందర్ లు మందమర్రి ఏరియాలోని కె.కె -5 గనిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి రక్షణలో భాగస్వామి కావాలని రక్షణ కమిటీ కన్వీనర్ బి.శ్రీనివాస రావు, జీఎం,(ఐ.అండ్ పి. ఎం) అన్నారు. అనంతరం మందమర్రి ఏరియ జనరల్ మేనేజర్ జి. దేవేందర్ మాట్లాడుతూ రక్షణ కోసం ఉద్యోగులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేసిన రక్షణ పరికరాలను పనిముట్లను వాడాలని, రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని అన్నారు. అనంతరం కమ్యూనికేషన్ సెల్ మందమర్రి ఏరియా వారిచే రక్షణ జాగ్రత్తల గురించి వివరిస్తూ ఉద్యోగులకు అర్థమయ్యే రీతిలో లఘు నాటిక అందరినీ ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో వి. రామదాసు కే.కే గ్రూప్ ఏజెంట్, ఏ.ఐ.టీ.యూ.సీ మందమర్రి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, పి.శ్రీనివాస్, ప్రవీణ్ వి.ఫాటింగ్, ఉమా కాంత్, జనార్దన్ రెడ్డి, డేవిడ్, ఇల్లందు, పోశమల్లు, డాక్టర్. వెంకటేశ్వర్లు, మనోహర్, రాజేశ్వర్ రావు, రవి, నాగమోహన్ ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking