ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 16 : ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.సోమవారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారి శ్రీనివాస్రావు, హరికృష్ణలతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. టి.డి.పి.పట్టణ అధ్యక్షుడు టి. మణిరాంసింగ్ తన దరఖాస్తులో 1993లో నిర్మించుకున్న తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. నస్పూర్ మండలం శ్రీరాంపూర్కు చెందిన బొద్దుల రాజయ్య తాను వృద్ధుడిని అయి పక్షవాతం వ్యాధి బాధపడుతున్నానని, తన కుటుంబ పోషణ కష్టంగా ఉందని, తనకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. జన్నారం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం తిరుపతి తన తండ్రి పేరిట గ్రామ శివారులో గల భూమి వివరాలను తమకు తెలియకుండా పహాణి రికార్డులలో మార్చారని, ఈ విషయమై సవరించి తమకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. కాసిపేట మండలం సండ్రల్పేట గ్రామానికి చెందిన గుమాస బానయ్య తన తండ్రి నుండి వరిపేట గ్రామ శివారులో వచ్చిన భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని,ఇట్టి భూమిని తమకు తెలియకుండా ఎవరి పేరిట మార్పు చేయవద్దని కోరుతూ దరఖాస్తు అందజేశారు. భా.జ.పా.కోటపల్లి మండల అధ్యక్షుడు మంత్రి రామయ్య తన దరఖాస్తులో మండలంలోని పారుపల్లి-లింగన్నపేట గ్రామాల మధ్య నూతనంగా నిర్మించిన వంతెనకు ఇరువైపులా ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగల కారణంగా ప్రయాణికులకు బస్సు సౌకర్యం లేకపోవడంతో పాటు పత్తి, ధాన్యం,గడ్డి ఇతరములు తరలించేందుకు ఇబ్బందిగా మారిందని,ఇట్టి విద్యుత్ తీగలను తొలగించి ప్రజల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారుల సమన్వయంతో పరిష్కరించే దిశగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking