ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ డిసెంబర్ 16 : జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలలో 3 నుండి 5 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ప్రభుత్వం ఏకరూప దుస్తులు అందజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో జిల్లా సంక్షేమాధికారి రౌఫ్ ఖాన్, మంచిర్యాల సి.డి.పి.ఓ.విజయలక్ష్మి లతో కలిసి పిల్లలకు ఏకరూప దుస్తులు అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో గల 319 అంగన్వాడీ కేంద్రాలలో 1 వేయి 810 మంది బాలికలు, 1 వేయి 827 బాలురు హాజరవుతున్నారని, ప్రభుత్వం నుండి 2 దశలలో 2 రకాల దుస్తులను ప్రతి ఒక్కరికి 2 జతల చొప్పున తయారు చేసేందుకు 5 వేల 59 మీటర్ల ఎరుపు రంగు, 1 వేయి 841 మీటర్ల తెలుపు రంగు,2 వేల 612 మీటర్ల నీలం రంగు గల వస్త్రాలను అందించడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా బెల్లంపల్లి,చెన్నూర్, లక్షెట్టిపేట,మంచిర్యాల ప్రాజెక్టుల పరిధిలోని 319 అంగన్వాడీ కేంద్రాలలో హాజరవుతున్న బాలబాలికలకు ఏకరూప దుస్తులు తయారు చేసి అందించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, అంగన్వాడీ టీచర్లు, పిల్లలు పాల్గొన్నారు.