ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 09 : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ,మండల కాంగ్రెస్ పార్టీ యువజన 63వ ఆవిర్భవ వేడుకలు ఘనంగా జరిగాయి.మున్సిపాలిటీ మరియు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండుగడుగు,తొమ్మిది ఏండ్ల పరిపాలనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు చేసిందేమీ లేదని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తానంది ఇప్పటికీ తొమ్మిది సంవత్సరాల గడుస్తున్న ఇప్పటివరకు నిరుద్యోగ భృతి లేదు,తెలంగాణలో ప్రతి నిరుద్యోగికి తల పై లక్ష అరవై మూడు వేల రూపాయల వరకు తెలంగాణ ప్రభుత్వం అప్పు ఉంది అని, నిరుద్యోగ భృతిని వెంటనే అమలు పర్చాలని యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల నియోజకవర్గ లక్షెట్టిపేట మున్సిపాలిటీ మండల అధ్యక్షులు అంకతి శ్రీనివాస్,రాందేని వెంకటేష్ , యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బోప్పు సుమన్, గుత్తికొండ శ్రీధర్,ఎస్ కెషఫీ,మూల కిషన్, చెందు,వెంకటేష్,ప్రవీణ్,ప్రశాంత్,మహేందర్,సుంకే బాపు,యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.