గౌడ్‌ హాస్టల్‌ కార్యవర్గం నియామకం

అంబర్‌పేట్‌ ప్రజాబలం ప్రతినిధి:హిమాయత్‌ నగర్‌ లోని గౌడ్‌ హాస్టల్‌ లో బుధవారం జరిగిన ఎంసీ సమావేశంలో కార్యవర్గ కమిటీని అధ్యక్షుడు మోతె చక్రవర్తి గౌడ్‌ ప్రకటించారు. కార్యవర్గంతోపాటు సలహాదారులు, కో ఆప్షన్‌ సభ్యులను కూడా ప్రకటించగా ఎంసీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఉపాధ్యక్షులుగా సోమ శైలజ గౌడ్‌, పరకాల లక్ష్మణ్‌ గౌడ్‌, బింగి గణేష్‌ గౌడ్‌, అయిలి వెంకన్న గౌడ్‌, ప్రధాన కార్యదర్శిగా ప్రతాప్‌ లింగం గౌడ్‌, సంయుక్త కార్యదర్శులుగా టివి రాజు గౌడ్‌ , విక్రమ్‌ గౌడ్‌ , స్వప్న గౌడ్‌, పి . అశోక్‌ గౌడ్‌ , కోశాధికారిగా లింగాల జ్ఞానేశ్వర్‌ గౌడ్లను ప్రకటించారు. సలహాదారులుగా పల్లె లక్ష్మణ్‌ రావు గౌడ్‌, చింతల మల్లేశం గౌడ్‌ , బాలరాజ్‌ గౌడ్‌ , గోవర్ధన్‌ గౌడ్‌ , శేషగిరి రావు గౌడ్‌ , పుల్లెంల రవీందర్‌ గౌడ్‌ లను అదేవిధంగా కో ఆప్షన్‌ సభ్యులుగా మోతె శ్రీనివాస్‌ గౌడ్‌ , వసంత్‌ కుమార్‌ గౌడ్‌ , పులి లక్ష్మి పతి గౌడ్‌ , విఠల్‌ గౌడ్‌, పగడాల లక్ష్మణ్‌ గౌడ్‌ లకు కూడా ఎంసీ సమావేశంలో సభ్యులంతా ఆమోదం తెలిపారు. ఈ సందర్బంగా అధ్యక్షుడు మోతె చక్రవర్తి గౌడ్‌ మాట్లాడుతూ హాస్టల్‌ అభివృద్ధికి అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంసీ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking