హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి: తెలంగాణ ఆల్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి సమావేశం ఈనెల 11వ తేదీ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాదులోని హోటల్ మోక్ష, నెక్లెస్ రోడ్ దగ్గర పివీ ఘాట్ రోడ్ లో ఉంటుంది. మధ్యాహ్నం 1:30 నుండి 2:30 గంటల వరకు లంచ్ ప్రోగ్రాం ఉంటుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా భారత మాజీ ప్రధాని పీవీ నరసిం హారావు తనయుడు, పీవీ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ ఆల్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఛాంబర్స్ కమిటీ చైర్మన్ పివి ప్రభాకర్ రావు , అలాగే డైరెక్టర్ ఆఫ్ కమర్షియల్ జె న్కో ,డాక్టర్ టి ఆర్ కె రావు , అలాగే ఎఫ్ ఎల్ డి ఐ ప్రెసిడెంట్, తెలంగాణ ఆల్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఛాంబర్స్ కమిటీ ప్రెసిడెంట్ పింగళి వెంక టేశ్వరరావు హాజరుకానున్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని హోటల్ మోక్ష లో జరిగే ఈ సమావేశానికి తెలంగాణ ఆల్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తనుగుల జితేందర్ రావు అధ్యక్షతన జరగనుంది. తెలంగా ణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులతో పాటు రాష్ట్ర కమిటీ బాధ్యులు, కొత్తగా ఫెడరేషన్ లో చేరబోయే వారు మాత్రమే ఈ సమావేశానికి హాజరు కావలసిం దిగా కోరుతున్నాము. అయితే ఈ సమావేశం లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఆయా జిల్లాలలో పనిచేస్తు న్న వారిలో ఫెడరేషన్ కు సహక రించని వారితోపాటు , రాష్ట్ర కమిటీ లో బాధ్యులుగా ఉంటూ ఫెడరేషన్ కు సహకరించని కొంతమందిని తొలగించి మరికొంతమంది కొత్త సభ్యులతో మన ఫెడరేషన్ బలోపేతం చేయడం కోసం తొల గింపులు , నియామకాలు చేపట్టబో తున్నాం. మిత్రులంతా ఈ సమావే శానికి ఆహ్వానించిన వారు తప్పక హాజరుకావాలని కోరడం జరుగుతున్నది.