* భారత రాజ్యాంగ పుస్తకాన్ని ఆవిష్కరించిన్న జిల్లా ఎస్ పి.
* రాజ్యాంగ విలువలకు కట్టుబడి అందరు జీవించాలి – దేశ సమగ్రత, ఐక్యతను ప్రతి ఒక్కరూ చాటాలి.
….. జిల్లా ఎస్ పి రూపేష్.
సంగారెడ్డి నవంబర్ 26 ప్రజ బలం ప్రతినిధి:
జిల్లా కేంద్ర లోని అంబెడ్కర్ స్టడీ సర్కిల్ లో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు పంబల దుర్గాప్రసాద్ అధ్యక్షతన 75 వ రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్ పి రూపేష్ పాల్గొన్నారు.అనంతరం ఎస్ పి చేతుల మీదుగా భారత రాజ్యాంగ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వాళ్ళని ఈ దేశ పరిపాలన కొనసాగుతుందని ప్రజలకు రాజకీయంగా ఆర్థికంగా అవకాశాల్లో కూడా సమభాగం కావాలని రాజ్యాంగాన్ని అందరూ చదవాలని సూచించరు. రాజ్యాంగం వల్లనే దేశం సుభిక్షంగా, ప్రశాంతంగా ప్రజలు ఉంటున్నారంటే దానికి మూలం అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే,ప్రజలు నిత్యం రాజ్యాంగాన్ని చదవాలని వాటిలో హక్కులను, అధికారాలను పొందాల్సిన బాధ్యత ప్రతి పౌరులు మీద ఉండాలని,రాజ్యాంగ విలువలకు కట్టుబడి అందరు జీవించాలని దేశ సమగ్రత, ఐక్యతను ప్రతి ఒక్కరూ చాటాలని ఈ సందర్భంగా తెలిపారు. రాజ్యాంగ వజ్రోత్సవాలు నేటి నుంచి జనవరి 26 వరకు నియోజకవర్గం, మండలలా వారిగా, గ్రామ గ్రామాన ఈ వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని, రాజ్యాంగం ఇంటింటా ఉండే విధంగా ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా తెలపడం జరిగింది. ఈ కార్యక్రమం లో అంబేద్కర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ పి. రామారావు,పోటీ పరీక్షల కన్వీనర్ కె. కృష్ణ కుమార్ మరియు ఎస్ సి ఎస్ టి మానిటరింగ్ మెంబెర్ దుర్గాప్రసాద్, అంబెడ్కర్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు కొండాపూర్ జగన్, గౌరవ పెద్దలు కోటయ్య, నాగయ్య, అనంతరామ్, విజయరావు, బక్కన్న, రాజు, ,జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సునీత, మాజీ ఎంపీపీ అశోక్, ప్రధాన కార్యదర్శి సంచుల ప్రవీణ్, జోగ్యల్ల రాజు, మహిళలు, మేధావులు, కళాశాల విద్యార్థినులు, మరియు స్టడీ సర్కిల్ విద్యార్థులు యువకులు తదితరులు పాల్గొన్నారు.
[6:17 pm, 26/11/2024] Ashok Sangareddy Reporter: End