మాదిగల ఐక్యవేదిక ఆత్మీయ సమ్మేళనం కరపత్రం ఆవిష్కరించిన కొమ్ము ప్రసాద్ మాదిగ

ఖమ్మం ప్రతినిధి నవంబర్ 26 (ప్రజాబలం) డిసెంబర్ 8వ తేదీ ఆదివారం జరిగే పాలేరు నియోజకవర్గ స్థాయి మాదిగల ఐక్యవేదిక ఆత్మీయ సమ్మేళన కరపత్రాన్ని కొమ్ము ప్రసాద్ ఆవిష్కరించి మాట్లాడుతూ ఈ దేశంలో దాదాపుగా 25 శాతం కలిగి ఉన్న నేటి వరకు కూడా మాదిగ జాతి మనుగడ సాధించలేక పోతున్నామని ముఖ్యంగా ఆర్థిక రాజకీయ సామాజిక రంగాలలో పురోగతి సాధించ లేకపోయాం దీనికి కారణం మనలో అనైక్యత మరియు నాణ్యత గల విద్యను పొందలేక పోవడం ముఖ్యంగా రాజకీయంగా ఒకటిగా లేము మనకు ఒక ఉమ్మడి లక్ష్యం లేదు మన హక్కుల కొరకు పోరాడిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు తన కుటుంబాన్ని భవిష్యత్తును జీవితాన్ని త్యాగం చేసి దళిత జాతి ప్రజలకు రాజకీయ హక్కులను సాధించి పెట్టారు రిజర్వేషన్ ద్వారా వచ్చిన ఉన్నత ఉద్యోగులు ప్రజాప్రతినిధులు సమాజంలో సౌకర్యాలను పొందే సుఖమైన జీవితాన్ని అనుభవిస్తున్నారే గాని జాతి ఆశించిన ఆత్మ గౌరవాన్ని సమానత్వాన్ని పొందడం లేదు ఎందుకంటే ఇంకా వెనకబడుతనాన్ని అనుభవిస్తున్నాము తరతరములుగా వస్తున్న వెనక బాటుతనాన్ని పోగొట్టుకొని ఆత్మగౌరవంతో తలెత్తుకొని బ్రతికే అవకాశాన్ని అందిపుచ్చుకునే ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాట్లాడటంజరిగింది . గోపి సుందర్ మాదిగ మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఈ దేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం రిజర్వేషన్ల వర్గీకరణ విషయాన్ని పరిశీలించి ఒక ఆర్డినేషన్ తీసుకురావడం జరిగిందని ఈ రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యంఅనుసరించకుండా మా న్యాయమేనా ఎస్సీ వర్గీకరణ విషయంలో వెంటనే బిల్లు ప్రవేశపెట్టి మాదిగ, మాదిగ ఉపకులాలకు న్యాయం పరమైన హక్కులు సాధించే వరకు మనమందరము సమైక్యతతో ఐక్యంగా మన హక్కులు సాధించేవరకు రాజకీయ పార్టీలు అతీతంగా మనమందరం భాగ్యస్వాములు కాగలరని మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో కనకం గోపాల్ ,కందుకూరి నాగన్న, చెరుకుపల్లి ఉపేందర్, నలగాటి నరేష్, గోపి సత్యం తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking