ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మార్చి 11:
సోమవారం కలెక్టరేట్ కార్యాలయము లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 77 అర్జీలను డిఆర్ఒ హరిప్రియ స్వీకరించారు. అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు అందజేస్తూ దరఖాస్తులను పెండింగ్ లో పెట్టకుండా వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిఆర్ఒ సంబంధిత అధికారుల ను సూచించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.