బీసీ కమిషన్ కార్యాలయంలో ఘనంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

 

తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ కార్యాలయంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఉదయం ఎనిమిది గంటలకు కమీషన్ చైర్మన్ డాక్టర్.వకుళాభరణం కృష్ణమోహనరావు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం సభ్యులు సిహెచ్ ఉపేంద్ర, కె కిషోర్ గౌడ్ లతో కలిసి జెండావందనం,జాతీయ గీతం ఆలపించారు.
అంతకుముందు అక్కడ ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూల మాలలు సమర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ వకుళాభరణం ప్రసంగిస్తూ… దేశంలో తెలంగాణ అభివృద్ధికి నమూనాగా నిలవడం ఆనందంగా ఉన్నది అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సమంగా ఫలాలు లభించడమే నిజమైన స్వాతంత్ర్యానికి స్ఫూర్తి.పదేళ్లలోపే రాష్టం అన్ని రంగాలలో. గొప్ప ప్రగతిని సాధించడం సీఎం కెసిఆర్ దార్శనికతకు ఒక నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు కే.ప్రసాద్ రావు, G.సతీష్ కుమార్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking