*వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేసిన అదనపు కలెక్టర్ వీరారెడ్డి
*ప్రాధాన్యత రంగాలకు రూ.6,565 కోట్లు
*ప్రాధాన్యేతర రంగాలకు రూ. 1235 కోట్లు
.అదనపు కలెక్టర్ వీరారెడ్డి
2023- 24 ఆర్థిక సంవత్సరానికి 7,800 కోట్ల రూపాయల తో
జిల్లా వార్షిక రుణ ప్రణాళికను ఆమోదించినట్లు తెలిపిన
….అదనపు కలెక్టర్ వీరారెడ్డి
సంగారెడ్డి జున్ 26 ప్రజ బలం ప్రతినిది:
సోమవారం కలెక్టరేట్ లోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లో డి సి సి/ డి ఎల్ ఆర్ సి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా 2023–24 జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ను అదనపు కలెక్టర్ వీరారెడ్డి విడుదల చేశారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్షిక రుణ ప్రణాళికలో ప్రాధాన్యత రంగాలైన వ్యవసాయం వాణిజ్యం, విద్య,గృహ రుణాలు, మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక రంగాలకు రూ.6,565 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ. 1235 కోట్లు కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు.
జిల్లా వార్షిక రుణ ప్రణాళిక లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, పంటల సాగుకు అవసరమైన పెట్టుబడుల కోసం రుణాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. పంట ఉత్పత్తి, నిర్వహణ, మార్కెటింగ్ కోసం రైతులకు పంట రుణాలు ఇవ్వనున్నట్లు, వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాలకు, వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు , వ్యవసాయ టర్మ్ రుణాలకు 4147 కోట్ల రూపాయలు, సూక్ష్మ సంస్థలకు 516.60 కోట్లు,చిన్న సంస్థలకు 167.40 కోట్లు, మధ్యతరహా సంస్థలకు 326 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందన్నారు.
ఎంఎస్ఎంఈ క్రింద మొత్తం 1010 కోట్ల రూపాయలు ఇవ్వడం లక్ష్యంగా కలదన్నారు.
విద్యారుణాలు కింద 85 కోట్లు, గృహ రుణాలు 1270 కోట్లు, సామాజిక మౌలిక సదుపాయాల కల్పన కు 46 కోట్లు, పునరుత్పాదక శక్తి క్రింద 7 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు 1235 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందన్నారు.
ఆయా రంగాలకు కేటాయించిన రుణాలు అందించడంలో బ్యాంకర్లు సహకరించి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని బ్యాంకర్లకు సూచించారు
బ్యాంకర్లు, జిల్లా అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.
అంతకుముందు 2022-23(మార్చి 31 నాటికి) వార్షిక రుణ ప్రణాళికలో సాధించిన లక్ష్యాలను ఎల్ డి ఎం గోపాల్ రెడ్డి వివరించారు.
ప్రాధాన్యత,ప్రాధాన్యేతర రంగాలకు సంబంధించి రూ.7080.80 కోట్ల లక్ష్యం కాగా,10,269.42 కోట్ల రుణాలు అందించి 145 శాతం లక్ష్యాన్ని చేరుకున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా వీరారెడ్డి వ్యవసాయ అధికారికి బ్యాంకర్ల కోఆర్డినేషన్ అవసరమని అన్నారు. ఏఈఓ వారిగా గ్రామం వారి బ్యాంకు బ్రాంచ్ వారి పంట రుణాల టార్గెట్, సాధించిన లక్ష్యాల వివరాలను అందించాలని సూచించారు.
అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పథకం పై రైతులకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో లీడ్ డిస్టిక్ మేనేజర్ గోపాల్ రెడ్డి, నాబార్డ్ ఏజీఎం కృష్ణ తేజ , ఆర్బిఐ ఏజీఎం అలీ బాబా,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్, మెప్మా పి డి, జిల్లా వ్యవసాయ అధికారి, సంక్షేమ శాఖల జిల్లా అధికారులు, బ్యాంకర్స్, తదితరులు పాల్గొన్నారు.