_బదిలీ చేయాలని ప్రజావాణిలో కోరిన యువకుడు_
జగిత్యాల ప్రతినిధి, జూన్ 26(ప్రజా బలం) జగిత్యాల జిల్లా వైద్యాధికారి విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఫిర్యాదులపై స్పందించారంటూ ఇక్కడి నుంచి బదిలీ చేయాలని 47 వ వార్డుకు చెందిన కోటగిరి మోహన్ అనే యువకుడు ప్రజావాణి లో కలెక్టర్ ఇచ్చిన వినతిపత్రం లో కోరారు. సోమవారం ప్రజావాణికి వెళ్లిన మోహన్ కలెక్టర్ కు వినతిపత్రం అందించారు. జగిత్యాల జిల్లా వైద్యాధికారి విధుల్లో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని, ఎప్పుడు ఆఫీసులో ఉండరని, ఫోన్ లిఫ్ట్ చేయరంటూ, ఫిర్యాదులపై స్పందించారంటూ వినతిపత్రం లో పేర్కొన్నారు. ఇటీవలే జిల్లా వైద్యాధికారి శ్రీధర్ కు 47 వ వార్డు లో ఉన్న బస్తి దవాఖాన వైద్యులు రావడం లేదని సమయ పాలన పాటించడం లేదని జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేసినని పేర్కొన్నారు. ఇప్పటికి బస్తి దవాఖాన తీరు మారలేదని జిల్లా వైద్యాధికారి కి విదులపట్ల చిత్త శుద్ది ఉంటే బస్తి దవాఖాన పనితీరు మెరుగుపడేదని పేర్కొన్నారు. వెంటనే జిల్లా వైద్యాధికారిని బదిలీ చేసి జిల్లాలోని వైద్యరంగాన్ని మెరుగుపరచాలని కోటగిరి మోహన్ కలెక్టర్ ను కోరారు.