అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని రహదారుల ఆధునీకరణ కోసం బి.ఎస్.పి. పార్టీ ధర్నా

 

పనులు చేసే గుత్తేదారులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చెయ్యకపోవడం వల్ల కుంటుబడిన అందోల్ అభివృద్ధి

అధికారంలోకి వచ్చి తొమ్మిదేండ్లైనా గత ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తూ కాలమేల్ల దీస్తున్న ఎం.ఎల్.ఏ.క్రాంతి

_డా.ముప్పారంప్రకాశం బి.ఎస్.పి. ఇంచార్జి, అందోల్ అసెంబ్లీ నియోజకవర్గం

సంగారెడ్డి/జోగిపెట్ జున్ 26, ప్రజ బలం ప్రతినిది: అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని రహదారుల ఆధునీకరణ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ *”బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ) అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి డా.ముప్పారంప్రకాశం ఆధ్వర్యంలో నేడు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం మరియు ఆర్ అండ్ బి ఎస్.ఇ. కార్యక్రమం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ముప్పారంప్రకాశం మాట్లాడుతూ అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల రోడ్లు గత తొమ్మిది సంవత్సరాలుగా ఎలాంటి మరమత్తులు చేయని కారణంగా వాహనాలే కాదు మనుషులు సైతం నడవలేనంత దారుణంగా దెబ్బతిన్నాయని, వాటిని బాగుచేయడం కోసం ఒక్క గుత్తేదారు ముందుకు రాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో నిధులు మంజూరు చెయ్యకపోవడం ప్రధానకారణం అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు హరీష్ రావు, కే.తరకరామరావ్ ల నియోజకవర్గల్లో అభివృద్ధి జరుగుతే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లు కాదని, ఎంత కాలం గత ప్రభుత్వాన్ని, మాజీ ఎమ్మెల్యేలను నిందిస్తూ ఉంటారని, ఈ తొమ్మిది సంవత్సరాలుగా అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మీకు చేతకాదని తేలిపోయిందని, అందోల్ ప్రజల సంక్షేమం కోసం బి.ఎస్.పి. కట్టుబడి ఉందని, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సారధ్యంలో రాబోయే ఎన్నికల్లో బిఎస్పి విజయం సాధించి ప్రజల కష్ట పంచుకుని పరిష్కారిస్తుందన్నరు.
ఈ ధర్నా కార్యక్రమం అనంతరం డిమాండ్లతో కూడుకున్న వినతి పత్రాన్ని రోడ్లు భవనాల శాఖ ఎస్సీ, జిల్లా రెవెన్యూ అధికారి మంచి నగేష్ కి ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎండి చాంద్ పాషా, అధ్యక్షులు పల్లె కుమార్ గౌడ్, నాయకులు పద్మారావు, ప్రేమ్ కుమార్, కిరణ్ కుమార్, ప్రకాష్, విజయ్, సురేష్, దయానంద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking