ముఖ్యమంత్రి కేసీఆర్ కు మన రాష్ట్రంలోనే కాక మహారాష్ట్రలో కూడా దిగ్విజయంగా బీఆర్ఎస్ ను ముందుకు నడిపిస్తున్నారు
…బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్
సంగారెడ్డి /పటాన్ చేరు జున్ 26: ప్రజ బలం ప్రతినిది:
ముఖ్యమంత్రి కెసిఆర్ మహారాష్ట్రలో జరుగబోయే సభకు భారీ ఖాన్వాయ్ లతో వెళుతున్న సందర్భంగా ఇస్నాపూర్ లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ నాయకులు, కార్యకర్తలతో భారీగా పార్టీ జెండాలతో ఘన స్వాగతం పలికారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ నీలం మధు ముదిరాజ్ కు చేయి ఊపుతూ సాదరంగా ముందుకు సాగారు. రాష్ట్రంలోనే కాక దేశంలో కూడా కీలక నేతగా మారనున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు ఇతర రాష్ట్రాల నాయకులు సైతం అందరి చూపు బీఆర్ఎస్ వైపే ఉందని తెలిపారు. మూడోసారి ముఖ్యమంత్రి అవ్వడమే కాకుండా దేశంలో పెను సంచలనాలు తీసుకొస్తారని తెలిపారు జాతీయ పార్టీగా అతి త్వరగా ఎదిగి దేశ ప్రజలకు మంచి భవిష్యత్తు ఇస్తుందని తెలిపారు ప్రజలు కూడా వారి సంక్షేమం చూసే నాయకుడిని వదులుకోబోరని ఆయన తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు ఆయన వెంట ఉండి బీఆర్ఎస్ ను అఖండ విజయంతో గెలిపిస్తారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో బిఆర్ఎస్ కార్యకర్తలు,ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, పాల్గొన్నారు.