జగిత్యాల ప్రతినిధి, జూన్ 26:(ప్రజా బలం) పొలాస నుంచి జగిత్యాల కు వెళ్ళేదారిలో తిమ్మాపూర్ చెరువు నీరు పొలాస చెరువులోకి చేరే రహదారి పూర్తిగా చెడిపోయి ప్రమాదాలకు నిలయమవుతోందని వెంటనే నాణ్యతతో మరమత్తు చేయించాలని పొలాస బిజెపి నాయకులు ప్రజావాణిలో కలెక్టర్ కు ఇచ్చిన వినతిపత్రంలో కోరారు. సోమవారం ప్రజావాణికి చేరుకున్న బిజెపి నాయకులు కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు. పొలాస నుంచి జగిత్యాల కు వెళ్లేందుకు తిమ్మాపూర్ మీదుగా దగ్గరి ధారన్నారు. ఈ దారిగుండా జగిత్యాల కు చెందిన 8 పాఠశాలల వ్యాన్లు పిల్లలను స్కూళ్లకు తరలిస్తారన్నారు. తిమ్మాపూర్ చెరువు నుంచి పొలాస చెరువులోకి నీరు వెళ్లేందుకు తిమ్మాపూర్ వద్ద ఉన్న రోడ్డు క్రింది పైపులు నీటి ఓత్తిడికి క్రింది నుండి పొలేక వర్షాకాలంలో పైనుంచి వెళ్లే నీటితో పూర్తిగా మునిగి ప్రమాదాలకు కారణమవుతోందన్నారు. అలాగే ఆటోలలో వచ్చే ప్రజలు వర్షాకాలంలో ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. గతంలో ఒక ఆటోడ్రైవర్ ఇక్కడ జరిగిన ప్రమాదంలో మృతిచెందాడని పేర్కొన్నారు. ప్రతి వర్షాకాలంలో తాత్కాలిక మరమతులతో ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా ఉందని ఈ రోడ్డును శాశ్వత ప్రాతిపదికన నిర్మాణం చేపట్టి ప్రజల, పిల్లల వాహన దారుల ప్రాణాలను కాపాడాలని కలెక్టర్ కు ఇచ్చిన వినతి పత్రంలో పొలాస బిజెపి నాయకులు కోరారు. ఈకార్యక్రమంలో బిజెపి నాయకులు ఓల్లాల రాజశేఖర్ గౌడ్, మెళ్ళ దామోదర్, గడ్డి తిరుపతి, కుర్మా రమేష్, నత్తి నాగరాజ్,మిల్కురి రాజన్న, గడ్డి మల్లేశం, తోట సత్యం,
ఎడ్ల మల్లేశంలు ఉన్నారు.