ఐకెపి విఓఎ ల డిమాండ్లను నెరవేర్చాలి నిరవధిక సమ్మె 8 వ రోజు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 24 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేటలో ఐకెపి వివో ఎలా డిమాండ్ల సాధనకై చేస్తున్న నిరవధిక సమ్మె 8వ రోజుకు చేరుకున్నది రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 8వ రోజున వంటి కాలుపై నిలుచొని నిరసన తెలియజేయడం జరిగింది.కనీస వేతనంగా 26,000 చెల్లించాలి సెర్పు ఉద్యోగస్తులుగా గుర్తించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి పది లక్షల సాధారణ భీమా కల్పించాలి అని డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దుర్గం రాములు మంచిర్యాల జిల్లా గౌరవ అధ్యక్షులు లింగంపల్లి వెంకటేష్ మండల అధ్యక్షులు శారద కార్యదర్శి కళావతి అంకత్ పల్లి మహిళలు పాత కొమ్ముగూడెం మహిళలు సూరారం మహిళలు లక్ష్మీపూర్ మహిళలు పోతపెల్లి మహిళలు కొత్తూరు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking