బ్రిలియంట్ మాడల్ స్కూల్ లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే.

 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 24 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట బ్రిలియంట్ మోడల్ స్కూల్ లో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు.సోమవారం పాఠశాలల ఆవరణలో గ్రాడ్యుయేషన్ డే నిర్వహించి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.ఈ సందర్భంగా చైర్మన్ సిరిపురం సత్యనారాయణ మాట్లాడుతూ…అమ్మ ఒడి నుండి చదువుల తల్లి ఒడి లోకి అడుగులు వేస్తున్న విద్యార్థులు భవిష్యత్తు లో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉంటుందని అన్నారు. పిల్లలు చదువు తో పాటు ఆట,పాటలల్లో రాణిస్తే మానసిక ఉల్లాసనానికి రాణిస్తే ఎంతో దోహదపడుతుందని అదేవిధంగా తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని విద్యార్థులకు తెలియజేసారు.ఇలాంటి గ్రాడ్యుయేషన్ డే లు నిర్వహించడం వలన పిల్లలకు చదువు పై మక్కువ పెరిగి మానసికంగా సంతోషంగా ఉంటారని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల రీజినల్ ఇంచార్జి శిల్ప,పాఠశాల ఇంచార్జి సాజన్య,పాఠశాల సిబ్బంది,విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking