ట్యాంక్ బండ్ పై 150 అడుగుల జ్యోతిబాపూలే విగ్రహాన్ని ప్రతిస్టించాలి

దేశంలోనే మొట్టమొదటి మహిళా పాఠశాలలు స్థాపించిన దంపతులు జ్యోతిబాపూలే దంపతులన్నారు
బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ డిమాండ్
రాజేంద్రనగర్ మార్చ్ 10 ();రాజేంద్రనగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద సావిత్రిబాయి పూలే126వ వర్ధంతి వేడుకలు దానంగా జరిగాయి. సావిత్రిబాయి చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా నేతలు మాట్లాడుతూవిద్య ద్వారానే ఈ సమాజం యొక్క రూపురేఖలు మార్చగలము అని 150 ఏళ్ల కిందనే గ్రహించిన దంపతులు అని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ కొనియాడారు. స్త్రీలు కేవలం వంటింటికి మాత్రమే పరిమితం చేసిన ఆ రోజులలో.. స్త్రీలు అన్ని రంగాలలో ముందుకు రావాలని ముఖ్యంగా అక్షరాస్యత నేర్పాలని దేశంలోనే మొట్టమొదటి మహిళా పాఠశాలలు స్థాపించిన దంపతులు జ్యోతిబాపూలే దంపతులన్నారు.ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ పై 150 అడుగుల జ్యోతిబాపూలే విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో రఘు గౌడ్, సత్యనారాయణ ముదిరాజ్, కృష్ణమాచారి, పచ్చ శ్రీనివాస్, మంత్రి చంద్రశేఖర్, వేముల రమేష్, కొమర గణేష్, మంగళరం శ్రీనివాస్, రఘు ముదిరాజ్, సుబ్బారావు, వీర్లపల్లి నవీన్, బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking