సదస్సులో పాల్గొన్న గ్రామ రైతులు
మెదక్ తూప్రాన్ మార్చి 10 ప్రజా బలం న్యూస్ :-
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇమాంపూర్ గ్రామంలో అగ్రికల్చర్ ఏఈఓ సంతోష్ కుమార్ రైతులకు వరి పంటలో వచ్చే కాండం తోలుచు పురుగు మరియు అగ్గి తెగులు నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రస్తుత దశలో వరి పంటలో అగ్గి తెగులు సోకి అధికంగా నష్టాన్ని కలిగిస్తుంది. వరి పైరు చిరుపొట్ట దశలో అగ్గి తెగులు లక్షణాలు గమనించినట్లయితే ఆఖరి దఫా యూరియా కొన్ని రోజులు తాత్కాలికంగా ఆపాలి. మొక్కలలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి పొటాష్ ఎం పి ఓ. ఎరువును ఎకరాకు 15-20 కిలోలు వేయాలి అగ్గి తెగులు నివారణకు ట్రైసైక్లోజోల్ 0.6 జి ఎం. + మ్యాన్కోజబ్ 0.25 జి ఎం. లేదా ఐసోప్రోతయోలెన్ 1.5 యం.ఎల్. లేదా కాసుగమైసిన్ 2.5 ఎం ఎల్. ఒక లీటరు నీటికీ చొప్పున కలుపుకొని ఉధృతిని బట్టి 10-15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి. ఈ కార్యక్రమంలో ఏఈఓ సంతోష్ కుమార్, గ్రామ రైతులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.